శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని సీపన్నాయుడుపేట వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉండే విజయాదిత్య పార్కును పునరుద్దరించమని బిజెపి శ్రీకాకుళం అసెంబ్లీ ఇంఛార్జ్ చల్లా వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా, ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా ఈ పార్కు ఉండేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు అది పూర్తిగా పాడైపోయి, గతంలో బోటు షికారుకు అనువుగా ఉండే చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిందని, వందల కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలం ఆక్రమణలకు గురవుతున్నాయని చల్లా వెంకటేశ్వర రావు అరోపించారు. పార్కు అభివృద్ధికి 2.54 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుకు ప్రతిపాదనలు పంపినట్లుగా తెలిసిందని, వెంటనే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిధులు విడుదలకు సహకరించి, పార్కును పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేయాలని, లేదంటే మొత్తం స్థలం అన్యాక్రాంతం అయిపోయే అవకాశం ఉందని అన్నారు. పార్కును పరిశీలించిన వారిలో బిజెపి నాయకులు సాదు కిరణ్ కుమార్, రావాడ పురుషోత్తం, భైరి అప్పారావు, బలగ సింహాద్రి, మల్లపురెడ్డి మనోజ్ కుమార్ తదితరులు ఉన్నారు.
0 Comments