నరసన్నపేట మండలం సత్యవరంలోని ZPHS School విద్యార్థులు గిడుగు రామ్మూర్తి పేరున బుధవారం అక్షర రూపం ఆకృతిని వేశారని HM ఒకలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆకృతిని విద్యార్థులు వేశారు. విద్యార్థుల్లో సాహిత్యంపై అభిలాష పెంపొందించేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఉన్నారు.
0 Comments