ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

24 గంటల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

శ్రీకాకుళం, సెప్టెంబర్ 24 : రానున్న 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాజ్ వే, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు, వాహన చోదకులను నియంత్రించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నెం:08942-240557 ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని చెప్పారు. గండ్లు పడే అవకాశమున్న చెరువులు, కరకట్టలు, కాలువల పై నిఘా ఉంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ముంపు నకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఆదేశాలు ఇచ్చేంతవరకు వారి వారి పని చేస్తున్న కేంద్రాలను విడిచి ఎవరూ వెళ్ళరాదని, ప్రభుత్వ అధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments