👉 చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం.
👉 నరసన్నపేట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిరసన.
నరసన్నపేట: నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మొక్కుబడి అరెస్టులు, బుకాయింపులతోనే గత కొన్ని రోజులుగా కాలయాపన జరుగుతోందని విమర్శించారు. సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు వాటాల వివరాలు బహిర్గతం అవుతాయని భయంతో కేసును దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆదేశాలపై సోమవారం నాడు నరసన్నపేట పట్టణంలోని తిరుమల వీధిలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీలు జడ్పిటిసిలు రాష్ట్ర, జిల్లా ,నియోజకవర్గ, మండలాల , అనుబంధ విభాగాల అధ్యక్షులు , కార్యవర్గ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments