👉పౌష్టికాహారం కిట్లు,పుస్తకాలు,స్కూల్ బ్యాగ్ లు అందజేత
👉శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత ,తైక్వాండో శ్రీను సైన్యం ఆద్వర్యంలో నిర్వహణ
👉తలసేమియా బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి
👉అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను
🙏పాల్గొన్న మెగా ఫ్యామిలీ అభిమానులు
శ్రీకాకుళం నగరం న్యూస్:
తలసేమియా బాధిత చిన్నారులకి మెగా అభిమానులు అండగా నిలిచారు. తమ అభిమాన నటుడు చిరంజీవి జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో బాగాంగా రెండవరోజైన శుక్రవారం చిరంజీవి యువత శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో చిన్నారులకి పౌష్టికాహారం కిట్లు,పుస్తకాలు,స్కూల్ బ్యాగ్ లు అందజేసారు. శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత,తైక్వాండో శ్రీను సైన్యం సంయుక్త ఆద్వర్యంలో తలసేమియా చిన్నారులకి తమ వంతు సహాయ సహకారాలను అందించారు. అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఇతర మెగా అభిమానుల చేతుల మీదుగా తలసేమియా బాధిత చిన్నారులకి కిట్ లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ తలసేమియా బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. తలసేమియా చిన్నారులకి అన్ని విదాలుగా శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ ఇన్ చార్జి మణికంఠ అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. చిన్నారుల రక్తమార్పిడికి నెలకి 150 నుంచి 200 యూనిట్ల రక్తం అవసరం అవుతుందన్నారు. వారికి ఎప్పుడు రక్తం అవసరమైన మణికంఠ ఆదుకుంటున్నారన్నారు. మెగా అభిమానులతో పాటు ఇతర సినీ హీరో అభిమానులు , స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల విద్యార్థులు, ఉద్యోగస్తులు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా రక్తం కొరత ఉంటుందని అన్నారు. ప్రజలంతా రక్తదానంపై అవగాహన కలిగి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా బాధితులతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తైక్వాండో శ్రీను కోరారు. ఈ కార్యక్రమంలో న్యూట్రీషియన్ కోచ్ నాగరాజు, రామ్ చరణ్ యువ శక్తి జిల్లా అధ్యక్షులు మజ్జి గౌతమ్ , గోవింద, ఆలిండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అద్యక్షుడు పుక్కల నవీన్ ,భాను, గిరి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కిర్రు, పెయ్యల చంటి, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శీర రాజు, పంకు మురళీ, చల్లా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments