ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

డిజిటల్‌ బుక్‌ ఆవిష్కరణ – జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు.మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

నరసన్నపేట:-వైఎస్సార్సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా రాష్ట్రస్థాయిలో డిజిటల్‌ బుక్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ శనివారం జిల్లా పార్టీ కార్యాలయం లో డిజిటల్‌ బుక్‌ ఆవిష్కరణ జరుగుతుంది . అలాగే ఈ నెల 28వ తేదీ ఆదివారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో డిజిటల్‌ బుక్‌ ఆవిష్కరణ జరుగుతుందని, అలాగే 29వ తేదీన ఆయా మండలాలలో సమన్వయకర్తల సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు డిజిటల్‌ బుక్‌ను ఆవిష్కరిస్తారని మాజీ మంత్రివర్యులు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు శ్రీరామరక్షగా నిలిచే ఈ డిజిటల్‌ బుక్‌ను ప్రతి స్థాయిలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments