ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గోడ పత్రికను ఆవిష్కిరించిన జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం, జూలై 30: శుక్రవారం సాయంత్రం  కలెక్టర్ కార్యాల చాంబర్ లో జిల్లా కలెక్టర్  శ్రీ కేశ్ బి.లాఠకర్ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ గోడ పత్రికను  ఆవిష్కిరించారు. సందర్భంగా చైల్డ్ లైన్   శ్రీకాకుళం జిల్లా బాలల  రక్షణ విభాగం  బాలలు, మహిళలు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా  కలిసి నడుద్దాం అనే గోడ పత్రికను  ఆవిష్కరించడం జరిగినది. 18 సం .లలోపు  బాలబాలికలు ఆపదలో ఉన్న సమయంలో  టోల్  ఫ్రీ నెంబర్ 1098 నకు సమాచారం  అందించాలని తెలిపారు.  వెట్టి చాకిరీ, బాలకార్మిక వ్యవస్థ, అవయవ మార్పిడి, వివాహ సంబంధనమైన వివిధ మార్గాల ద్వారా  మానవ అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు.  జిల్లాలో  మానవ అక్రమ రవాణా  జరుగుతున్నట్లు  ఎవరికైన తెలిసినట్లైతే   సమాచారాన్ని ఈ టోల్ ఫ్రీ నెంబరుకు  తెలియజేయాలని  కోరారు.
ఈ కార్యక్రమంలో  స్త్రీ శిశు సంక్షేమశాఖ  పథక సంచాలకులు డా. డి. జయదేవి, డిసిపిఓ  కె.వి.రమణ, చైల్డ్ లైన్ నోడల్  కో-ఆర్డినేటర్ ఎం . సింహాచలం,కొలాబ్ కో - ఆడ్డినేటర్ పి.పేమలత , మెహర్ వాణి, డి.హేమలత, డి.బి.రాజులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments