గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేట పట్టణంలో 12 వ వార్డు శివనగర్ కాలనీలో పరిధిలో కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, ఇంటింటి త్రాగునీరు కోలాయి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి చేసే దిశగా అన్ని విధాల కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహులు, శిమ్మ చంద్రశేఖర్,జామి వెంకట్రావు, గొద్దు చిట్టిబాబు, ఊన్న వేంకటేశ్వరరావు,సరిపల్లి మధు,సాసుపల్లి కృష్ణ బాబు,భైరి భాస్కరరావు,బోయిన సతీష్,కింజరాపు రామారావు,బలగ ప్రహర్ష,గొలివి రామారావు,రావాడ గణపతిరావు,మొయ్యి హరికృష్ణ,గొలివి గణేష్, చీరంజివి,వారణాసి రమేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments