ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో జూలై 8 వ తేదీన నరసన్నపేట నియోజకవర్గం లోని జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించబడుతున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను యువనేత పోలాకి జెడ్.పి.టి.సి శ్రీ ధర్మాన కృష్ణ చైతన్య గారి చేతులమీదుగా తమ క్యాంప్ ఆఫీస్ నందు ఈరోజు ఉదయం ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో సుమారు 11 స్థానిక మరియు బహుళజాతి ప్రైవేట్ సంస్థలు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని ఈ సదావకాశాన్ని పదవతగతి నుంచి పి.జీ వరకు ఏదయినా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగ పరచుకోవాలని, మరిన్ని వివరాలకొరకు 6301045132, 6301275511 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎస్.ఎస్.డి.సి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.బి సాయి శ్రీనివాస్ గారు, జలుమూరు ఎంపిపి వాన గోపి గారు, నరసన్నపేట ఎంపిపి ఆరంగి మురళి గారు, మండల JCS కన్వీనర్ ధర్మాన జగన్ మరియు  ఏ.పి.ఎస్.ఎస్.డి.సి సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments