ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

క్రమశిక్షణ విజయానికి తొలి మెట్టు. ప్రిన్సిపాల్ సిహెచ్ కృష్ణారావు

నరసన్నపేట పట్టణంలోని జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే వేడుకలను ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ డే నిర్వహణతో పాటు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫేర్వెల్ డే సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ కృష్ణారావు మాట్లాడుతూ క్రమశిక్షణ విద్యార్థుల విజయానికి తొలి మెట్టు అని తెలిపారు. కావున ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని కోరారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో శ్రమ పడితే గాని ఉన్నత శిఖరాలు అధిరోహించలేరని స్పష్టం చేశారు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నేను జ్యోతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వరుదు ప్రవీణ మాట్లాడుతూ డిగ్రీలో చదువుకున్న మూడేళ్ల విద్య.. వందేళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసి, సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఓ లు హనుమంత అప్పారావు, వెలమల సత్యనారాయణ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసిరినాయుడు తదితర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments