నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామం లో దూకులపాడు - గొట్టిపల్లి క్లస్టర్ పరిధి రచ్చబండ(కార్యకర్తల తో కృష్ణచైతన్య) కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో సంక్షేమం కంటే కక్షలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలను ఇబ్బందుల గురి చేయడమే కూటమి లక్ష్యంగా పాలను కొనసాగుతుందని, అందుకోసమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఆవిష్కరించారని, కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను, కష్టాలను కార్యకర్తలే నేరుగా డిజిటల్ బుక్ లో నమోదు చేయవచ్చునని సూచించారు. కార్యకర్తలకు అండగా ఎల్లప్పుడూ ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలకు రాబోయే జగనన్న పాలనలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. యువతకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అన్ని వర్గాలు వారు తగిన బుద్ధి చెపుతారని అన్నారు . ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జ్ శ్యాం ప్రసాద్ రెడ్డి , ఎంపీపీ అరంగి మురళీధర్ , జెడ్పీటీసీ చింతు రామారావు, మండల అధ్యక్షులు లుకలాపు రవి,రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న,నియోజకవర్గ పంచాయతీ రాజ్ అధ్యక్షులు బగ్గు రమణయ్య , నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు సురంగి నర్సింగరావు,రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు , ఆల్ ఇండియా తూర్పు కాపు అధ్యక్షులు పతివాడ గిరీశ్వరం , మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు,మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్,మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు పాగోటి భరత్, మండల పార్టీ ఉప అధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు, సర్పంచ్లు అల్లు ఆశిరినాయుడు , అవ్వ రవి , రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ మండల యూత్ ఉప అధ్యక్షులు తోట భార్గవ్ తదితరులు పాల్గొన్నారు
0 Comments