ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శిష్టకరణ కులానికి 50 కోట్లకు పైగా ప్రభుత్వ సహాయం.కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని క్రిష్ణ.

నరసన్నపేట:శిష్టకరణ కులానికి జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో వివిధ పధకాలు ద్వారా 50 కోట్లకు పైగా లబ్దిదారులకు సహాయం అందిందని శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని క్రిష్ణ అన్నారు. నరసన్నపేట లో శనివారం శిష్టకరణ వైసీపీ అభిమానులతో సమావేశం నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్దమోత్తంలో ఈ కులానికి ఇంత సహాయం జరగలేదని క్రిష్ణ అన్నారు. ఈ నియోజకవర్గం లో సుమారు 800 కుటుంబాలకు కూడా ఎం ఎల్ ఏ ధర్మాన కృష్ణదాస్, యువనేత, ధర్మాన క్రిష్ణ చైతన్యల సహకారంతో ప్రతి శిష్టకరణ కులస్తునికి అనేక పధకాలు అందటం ద్వారా మంచి ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. నరసన్నపేట సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీ లో సుమారు 50 మంది శిష్టకరణ కులస్తులు ఉన్నారని, అర్హత ఉండి మిస్ అయిన మరో 15 కుటుంబాలకు కూడా మంజూరు చేస్తామని చినబాబు హామీ ఇచ్చారని క్రిష్ణ అన్నారు.
       ఈ విధంగా మళ్ళీ ఈవిదమైన పధకాలను మనం పొందాలంటే దాసన్నగారిని ఇక్కడ గెలిపించు కోటం ద్వారా జగన్ గారిని మరో సారి సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సి ఉందని డైరెక్టర్ సదాశివుని క్రిష్ణ అన్నారు. శిష్టకరణ కులాన్నీ బీసీ డి లో చేర్పించి నందుకు, మరియు మనకులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రతి శిష్టకరణ కుటుంబం వైస్సార్ కుటుంబానికి రుణపడి ఉన్నామని సదాశివుని అన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్ ప్రభాకరరావు, సీనియర్ వార్డుమెంబెర్ రఘుపాత్రుని శ్రీధర్, సంఘం ప్రధాన కార్యదర్శి అంపలాం వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments