ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆగష్టు 29న వ్యవసాయ యాంత్రీకరణ మేళా.

*ఆగష్టు 29న వ్యవసాయ యాంత్రీకరణ మేళా*

*పరిశోదనా సంచాలకులు డా.పి.వి సత్యనారాయణ*

శ్రీకాకుళం, ఆగష్టు 27: ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, వ్యవసాయ పరిశోధనా స్థానము రాగోలు లో పరిశోధన సహ సంచాలకులు, ఉత్తర కోస్తా మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం, రాగోలు,  వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఆగస్టు 29 గురువారం వ్యవసాయ యాంత్రీకరణ మేళా నిర్వహించనున్నట్లు ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డా. పి.వి సత్యనారాయణ అన్నారు

ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి 9.30 గంటల వరకు  పేర్లు నమోదు చేయనున్నారు. అనంతరం 9.30 గంటలకు క్షేత్ర సందర్శనతో కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 01.00 గంట వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన, వ్యవసాయ క్విజ్, రైతు సదస్సు గౌరవ అతిథుల ప్రసంగాలు వ్యవసాయ ప్రచురణల విడుదల. భోజన విరామం అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన & రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్ఠి జరుగుతుందన్నారు. ఈ సదా అవకాశాన్ని రైతులందరూ  వినియోగించుకొవాలన్నారు.

Post a Comment

0 Comments