శ్రీకాకుళం, సెప్టెంబర్ 27 : జిల్లా వ్యాప్తంగా నేడు ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కిందట ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఒకవేళ పూర్తిచేయకపోతే అవి రద్దవుతాయని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి మండల ప్రత్యేక అధికారులు లబ్ధిదారులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
28వ తేదీ శనివారం ప్రతీ లే–అవుట్‌లోను సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సదస్సులకు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని, అలాగే లే–అవుట్ ఇన్‌ఛార్జులు, హౌసింగ్ ఇంజనీర్లు, సచివాలయ సంక్షేమ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తప్పక హాజరు కావాలని ఆదేశించారు. లే–అవుట్‌లో మౌలిక వసతులు కల్పించే విద్యుత్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులు కూడా భాగస్వామలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని హౌసింగ్ డిఎం బి.నగేష్ ను ఆదేశించారు.
0 Comments