ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

నరసన్నపేట:అఖిలభారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో శనివారం నరసన్నపేట బీసీ హాస్టల్ వద్ద భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా  నివాళులర్పించారు. అనంతరం ఏఐవైఎఫ్ నరసన్నపేట నియోజకవర్గ కార్యదర్శి నెయ్యల సాంబశివరాజు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రఖ్యాత ఉద్యమకారుడుగా భగత్ సింగ్ చరిత్రకి ఎక్కాడని అన్నారు. ఢిల్లీ వీధులలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చినది భగత్ సింగ్ అని ఆయన గుర్తు చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల నాయకుడిగా భగత్ సింగ్ కొనియాడ బడుతున్నారని హితవు పలికారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఏఐవైఎఫ్ అనేక ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు చిన్నబాబు, వసంత్, కార్తీక్, వినయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments