ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జాబ్ మేళాకు భారీ స్పందన

నరసన్నపేట.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలమేరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాది శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంనకు సంబంధించి స్థానిక ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా నిర్వహించటం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాకి 5 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. దీనిలో 207 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 68 మంది వివిధ కంపెనీలలో ఎంపికకావటం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొగ్గు రమణమూర్తి గారు నిరుద్యోగ యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గం లో ఉద్యోగ మేళా నిర్వహించటం చాలా సంతోషకరం గా ఉంది. నిరుద్యోగ యువతీ యువకులు అవకాశం అందిపుచ్చుకోవాలి అని అన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు కట్టుబడి ఈ ప్రభుత్వం ఉంటుంది అని తెలిపారు. నియోజకవర్గం పరిసర ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రధన్యతగా భావిస్తమన్నారు. ప్రతి నెల కూడా జాబ్ మేళా నియోజకవర్గం లో నిర్వహిస్తామని తెలిపారు.

అలాగే కళాశాల ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ జాబ్ మేళా కి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.  

అదేవిధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి . సాయి కుమార్ గారు మాట్లాడుతూ జిల్లాలో స్కిల్ హబ్స్ మరియు స్కిల్ కాలేజస్ ద్వారా నిర్వహిస్తున్న వంటి కోర్సెస్ గురించి వివరించడం జరిగింది 

ఈ కార్యక్రమానికి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డాక్టర్ పి. లత గారు , రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది , మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments