*ఐఐఐటి డైరెక్టర్ కె.వి.జి.డి బాలాజీ*
శ్రీకాకుళం, అక్టోబర్ 29: క్రీడలలో మరింత రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఐఐఐటి డైరెక్టర్ కె.వి.జి ధన బాలాజీ అన్నారు.
9వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఇంటర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 24-25లో పాల్గొని మూడవ స్థానం కైవసం చేసుకున్న పియుసి విద్యార్థిని వినూత్మను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఐఐఐటి డైరెక్టర్ కె.విజిడి బాలాజీ అబినందిస్తూ చదువుతోపాటు విద్యార్థినీ విద్యార్థులు క్రీడల పై మక్కువ చూపాలన్నారు. క్రీడలలో రాణించి ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాల అధిరోహించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముని రామకృష్ణ, డీన్ మోహన కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, ఫిజికల్ ఎడ్యుకేషన విభాగానికి చెందిన రాజు, టి . విలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments