శ్రీకాకుళం, అక్టోబర్ 29: కుల, మతా, ప్రాంతాలకు అతీతంగా అందరూ జరుపుకొనే పండుగ దీపావళి అని ఈ పండగను ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా జరుపుకోవాలని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి జే మోహనరావు అన్నారు.
దీపావళి పండగ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రమాద రహిత దీపావళి.. పర్యావరణ పరిరక్షణ రహిత దీపావళి చేయటం తమ లక్ష్యమని అన్నారు... మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని... పిల్లలు బాణాసంచా కాల్చిన సమయంలో పెద్దలు పక్కనే ఉండాలని ఆయన సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో 94 బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్ లు మంజూరు చేయడం జరిగిందని, అనధికారికంగా మందుగుండ అమ్నే వారిపై పోలీస్ శాఖతో కలిసి వెళ్ళి దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ కలిగిన బాణాసంచా మాత్రమే వినియోగించాలని, సరదా కోసం నిండు జీవితాలను నాశనం చేసికోవొద్దు అని సూచించారు. కాటన్ దుస్తులు ధరించి, నీటి నిల్వలు సిద్ధం చేసుకొని, బాణాసంచా కాల్చాలని మోహనరావు సూచించారు. మందుగుండ విషయంలో ఆజాగ్రత్త వహిస్తే జీవితాలు నాశనం అవుతాయని ఇది గ్రహించి ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
0 Comments