

నరసన్నపేట మండలం జమ్మూ కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పోలాకి మండలం జిల్లేడు వలస గ్రామం నుంచి నరసన్నపేటలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు శనివారం ఉదయం క్యాబ్ లో వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ క్రమంలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్సై దుర్గాప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ దాలినాయుడు తెలిపారు. గాయపడిన విద్యార్థులను నరసన్నపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని తెలిపారు.
0 Comments