నరసన్నపేట : నయ వంచనకు మారుపేరైన.. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ధరలన్నీ విపరీతంగా పెంచేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కల్ల బొల్లి కబుర్లకే పరిమితమైందని విమర్శించారు. అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చి పట్టుమని నాలుగు నెలలు కూడా నిండక ముందే మాట తప్పారని, వాహనాల పన్నులను ఒక్కసారిగా పెంచేసారని, డిసెంబర్లో స్థిరాస్తుల మార్కెట్ ధరలు కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారని, మందు రేట్లు తగ్గిస్తామని చెప్పి మాట తప్పారని దుయ్యబట్టారు.
చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనతో జిల్లాకు ఒరిగింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తమ అధినేత ముఖ్యమంత్రిగా జిల్లాకు పోర్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం రక్షిత మంచినీటి పథకం, ఫిషింగ్ హార్బర్లు చరిత్రలో నిలిచిపోయేలాంటి పథకాలు ఎన్నిటినో పూర్తి చేశారన్నారు. కానీ చంద్రబాబు జిల్లాకు ఏనాడైనా గుర్తుండిపోయే ఒక మంచి పని అయినా చేశాడా అని కృష్ణ దాస్ ప్రశ్నించారు. హంగు, ఆర్భాటాలు, హడావిడి తప్ప ఈ పర్యటనతో జిల్లాకు పనికొచ్చే పని ఒక్కటైనా చేశారని విమర్శించారు.
0 Comments