శ్రీకాకుళం న్యూస్:ఎస్సీ వర్గీకరణపై పునరాలోచన చేయాలని అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శనివారం వినతిపత్రం అందజేసారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ మేరకు ఏఐమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను కలుసుకుని వినతిపత్రం అందించారు. ఎస్సీ ,ఎస్టీలకి క్రిమిలేయర్ అమలు చేయవద్దని కోరారు. అలాగే దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేయాలని విజ్ఞప్తి చేసారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ,ఎస్.సి సబ్ ప్లాన్ నిధులను దళితుల కోసమే ఖర్చు చేయాలని విన్నవించారు.దళితులు నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాజ్యాంగం దళితులకి కల్పించిన హక్కులను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం అందజేసిన సమయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ,రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ,పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష,ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తదితరులు అక్కడ ఉన్నారు. వినతిపత్రం అందజేసేందుకు ముందు జిల్లా పర్యటనకి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తైక్వాండో శ్రీను పుష్పగుచ్చాన్ని అందజేసారు.
0 Comments