ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన - MLA బగ్గు రమణమూర్తి

పొలాకి, నవంబర్ 04: ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన ఎంతో ఉపయోగపడుతుందని, ఈ సర్వేకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు.

పొలాకి మండలం కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, పోలాకి మండలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన కార్యశాలలో నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పాల్గొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి అయిదు సంతకాలలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ఒకటని, యువతకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సర్వేను చేపట్టినట్లు తెలిపారు.

ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, డిప్లమా కళాశాలలను గుర్తించి అక్కడి విద్యార్థులకు నైపుణ్య గణన ప్రాముఖ్యతను వివరించి స్వీయ గణన చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ఇంటింటికి వెళ్లి 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఒక్కరికి సర్వే చేపట్టి డేటా సేకరించాలని, దీనిపై ఎవరికి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసి నైపుణ్య గణన ఉపయోగాలను వారికి ఓపిగ్గా వివరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పొలాకి మండలం గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments