*దర్యాప్తు లో ఉన్న లాంగ్ పెండింగ్ కేసు, ప్రాపర్టీ కేసుల దర్యాప్తు ను వేగవంతం చేయాలి.
*ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై ద్రుష్టి కేంద్రకరించాలి.
*జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి.
*నేర సమీక్ష సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ.
శ్రీకాకుళం, డిసెంబర్ 24. అపరిష్కృతంగా ఉన్న ప్రాపర్టీ కేసులు, మహిళలకు సంబంధించిన కేసులపై దృష్టి కేంద్రీకరించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని, జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టాలని, పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు అదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐ లతో జిల్లాలోని ముఖ్యమైన కేసులు గురించి జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ముందుగా ముఖ్యమైన ప్రాపర్టీ కేసు ల గురించి ఆరా తీస్తూ, ప్రాపర్టీ కేసులలో ఇప్పటికే ముద్దాయిలు అరెస్ట్ అయిన కేసులలో త్వరిత గతిన ఛార్జ్ షీట్ దాఖలు చేసి, భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదలకు ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన విచారణ జరిపి, బాధితులకు చట్ట పరిధిలో న్యాయం చేకూర్చలని అట్టి ఫిర్యాదులపై ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతిరోజు గ్రామాలలో సందర్శించి గ్రామాల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ఎటువంటి తగాదాలు,నేరాలు జరగకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. అలానే ఇప్పటి వరకు మొత్తం జిల్లాలో ఉన్న యుఐ కేసుల గురించి ఆరా తీసి, లాంగ్ పెండింగ్ దర్యాఫ్తు లో ఉన్న కేసులలో నైపుణ్యం గల ధర్యాప్తును చేస్తూ తొందరగా పూర్తి చేయాలని సూచించారు.. తరువాత పోలీస్ స్టేషన్ వారీగా ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని, కేసులు యొక్క ధర్యాప్తు తొందరగా పూర్తి చేయాలని, ఆక్సిడెంట్ కేసులు, పెండింగ్ ఎన్బిడబ్లూ ల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో దొరికిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్సు లు సీజ్ చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై ద్రుష్టి కేంద్రకరించి, పేకాట శిబిరాలు పైన, బెల్టు షాపుల పైన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలని, ప్రజలతో మమేకమై గ్రామంలో సమస్యలను గుర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులు ను గుర్తించి, ప్రాథమిక స్థాయిలోనే ఆయా వ్యక్తులను ముందస్తుగా బైండ్ ఓవర్ చేయలన్నారు. గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతని ఇవ్వాలని, గంజాయి కేసుల్లో అరెస్టు కాబడిన నిందితులపై నిరంతర నిఘా పెట్టాలన్నారు. నిరంతరం వాహన తనిఖీలుచేస్తూ, జిల్లాలో పూర్తి స్థాయిలో అక్రమ రవాణాను అరికట్టాలని, తప్పుడు నెంబర్ ప్లేట్ లు ఉన్న వాహనాలను గుర్తించాలని, ముఖ్యంగా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంకల్పం పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యాలు వలన కలిగే అనర్ధాలు పై విద్యార్దులు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అదే విదంగా సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాత ముద్దాయిలపై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంతవరకు సంబంధిత అధికారులు చేపట్టిన దర్యాప్తును పరిశీలించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు. రాత్రి వేళల్లో గస్తీ విధుల్లో అప్రమత్తంగా తిరుగుతూ పాత నేరస్థులను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రద్దీ ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకులు, కళాశాలల వద్ద విజిబుల్ పోలీసింగు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిలను కట్టడి చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీలు వివేకానంద, మూర్తి, ఏఓ గోపీ నాథ్, జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు,ఎస్ఐ పాల్గొన్నారు.
0 Comments