
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో గురువారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కార్యక్రమం ముగిసిన అనంతరం హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా పాల్గొన్న అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అనుబంధ విభాగాల నేతలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తల సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. జిల్లాలో వచ్చిన విశేష స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అన్ని వర్గాలు సిద్ధంగా ఉండాలనీ ఆకాంక్షించారు.
0 Comments