ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయవచ్చు.

శ్రీకాకుళం:చిత్రలేఖనం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడం సాధ్యమవుతుందని *బి హెచ్ ఆర్ సి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు మణిశర్మ, జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎన్జీవోహంలో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల్లో దేశభక్తి కలిగేలా చిత్రలేఖన పోటీలను భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని, భావ వ్యక్తీకరణను మెరుగుపరుస్తుందన్నారు. సృజనాత్మకతను పెంపొందించడానికి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి భయపడకూడదన్నారు. పెయింటింగ్, డ్రాయింగ్, సంగీతం, నృత్యం, నాటకం మొదలైన వాటిలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడానికి అవకాశం లభిస్తుందని చెప్పారు. విద్యార్ధులు సృజనాత్మకతను పెంచుకొని చదివితే ఉన్నత స్ధితిలో రాణించగలుగుతారని వివరించారు. పెయింటింగ్ పోటీల్లో మొదటి దశను ఆయా పాఠశాలల్లో నిర్వహించామని, రెండో దశను అన్ని పాఠశాల విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 14న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతుల మీదగా బహుమతులు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త జైశ్రీరామ్, బి హెచ్ ఆర్ సి నగర అధ్యక్షులు ఆకుల కృష్ణ, యూత్ వింగ్ అధ్యక్షులు కార్తీక్ తో పాటు, పలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments