
శ్రీకాకుళం / నిమ్మాడ,ఆగస్టు,28: అర్హులైన ఏ ఒక్కరికీ ఫించన్లు రద్దుకావని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో వివిధ సమస్యలపై మంత్రి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతి పత్రాలను అందజేశారు. వచ్చిన వినతలను మంత్రి స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్ మాట్లాడి పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశించారు. ప్రభుత్వం నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయాలని అర్జీదారులు కోరారు. అదేవిధంగా వికలాంగ పంఛన్లు పుణఃపరిశీలన పేరుతో విచరాణ చేపట్టి తొలగిస్తున్నారని మంత్రి దృష్టికి పలువురు అర్జీలు మంత్రికి అందజేశారు. అర్హులైన ఏ ఒక్కరికీ ఫించన్లు రద్దుకావని వివరించారు. అర్హత ఉన్న వారికి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, నాలుగు మండలాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
0 Comments