శ్రీకాకుళం / నిమ్మాడ,ఆగస్టు,28: జిల్లాలో ఖరీఫ్ రైతాంగానికి ఎరువులు కొరత లేకుండా పటిష్టవంతమైన చర్యులు చేపట్టాలని, యత్రాంగం ఎరువులు అందజేయడంలో వైఫల్యం చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలో వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని, అందువలన పూర్తిస్థాయిలో ఎరువులు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న బఫర్ నిల్వగా ఉంచిన 500 మెట్రక్ టన్నులు కూడా రైతులకు అందించాలని, పంపిణీలో ఇబ్బందులు లేకండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు రావాల్సి ఉంటే వాటిని కూడా త్వరితగతిన తెప్పించి రైతులకు అవసరాలు తీర్చాలన్నారు. జిల్లాకు వచ్చిన ఎరువులు, పంపిణీ చేసిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. నేరుగా వ్యవసాయ శాఖ కమీషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి జిల్లాకు ఇంకా రావాల్సిన ఎరువులు తక్షణమే పంపించాలని మంత్రి ఆదేశించారు. రైతులు ఆందోళన చేందాల్సిన అవసరం లేదని అవసరమైన మేరకు ఎరువులు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ త్రినాధరావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్లొన్నారు.
0 Comments