ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఒకటవ తరగతి ప్రవేశానికి లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు.-ఎస్ ఎస్ ఏ ఏపీసి డా. శశి భూషణ్

శ్రీకాకుళం, ఆగస్టు 28: విద్యా హక్కు చట్టం – 2009 ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలు (అనాధలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసి వర్గాలకు చెందిన పిల్లలకు రాష్ట్రవ్యాప్తంగా వారి నివాస సమీపంలోని IB/CBSE/ICSE/స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేటు ఆన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కోసం లాటరీ ద్వారా సీట్లు కేటాయించడం జరిగిందని సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ ఎస్ శశిభూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను సంబంధిత పాఠశాలల్లో, పాఠశాల వెబ్‌సైట్లలో పరిశీలించవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా ఈనెల 31వ తేదీ లోగా కేటాయించిన పాఠశాలలో జాయిన్ అవ్వాలని సూచించారు.

ఇతర వివరాల కోసం సంబంధిత మండల విద్యాశాఖాధికారిని లేదా జిల్లా నోడల్ అధికారి (RTE) ఫోన్ నెంబర్ 9440484672 ను సంప్రదించవచ్చని, టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 8599 కూడా అందుబాటులో వుందని వివరించారు.

Post a Comment

0 Comments