ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఉపాధి అవకాశాల కోసం రేపు ఇంటర్వ్యూలు.జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.సుధ

శ్రీకాకుళం, ఆగస్టు 28: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా ఇంటర్వ్యూలు శనివారం (30.08.2025) ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.సుధ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డిగ్రీ, ఇంటర్, ఐటీఐ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.13,000 నుండి రూ.20,000 వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు సంబంధిత సర్టిఫికేట్లు, బయోడేటాతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో హాజరుకావాలని కోరారు.

Post a Comment

0 Comments