ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి.

నరసన్నపేట: విద్యార్థిని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తే విధిగా ప్రయోజకులు అవుతారని, విశ్రాంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. జ్యోతి ఫెడరిక్ అన్నారు. నరసన్నపేట లో ఎస్ వి సి టి, మరియు పదాల చారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా సోమవారం నిర్వహించిన బీద విద్యార్థులకు, నూతన దుస్తులు పంపిణీ కార్యక్రమం లో ఆమె ప్రసంగించారు. కళాశాల లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా తనకు విద్యార్థులతో అనుబంధం ఎక్కువని వారికి పలు సూచనలు చేశారు. గౌరవ అతిధిగా పాల్గొన్న స్వామీబాబు మనుమడు టంకాల అర్జున్ మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థాణాల్లో ఉన్నవారికి తన తండ్రి ఘ్ఞాపకార్ధం నగదు ప్రోత్సాహకాలు చెల్లుష్టామని ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ ఆసరా సేవా సంస్థ అధ్యక్షులు సదాశివుని క్రిష్ణ మాట్లాడుతూ ఎస్ వి సి టి, పడాల ట్రస్టు వారు బాలికలకు సానిటరీ పాడ్స్ కూడా ఉచితంగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రోగ్రాము కో ఆర్డినేటర్ దేవిరెడ్డి రమేష్ మాట్లాడుతూ స్వామీబాబు వజ్రమ్మ చారిటబుల్ ట్రస్టు, పదాల చారిరబుల్ ట్రస్టు లు సంయుక్తంగా ప్రోగ్రామే వారధిలో భాగంగా ఈ కార్యక్రమం తో పాటు పౌష్టికాహారం నోట్ పుస్తకాలు, కేరీర్ గ్యడెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు మెంబెర్ బంకుపల్లి లోకనాధశర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలానికి కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాలు సాయి శ్రీనివాస శర్మ,కరుణ్, శ్రీదేవి,దివ్య, సాయి, రామారావు, లక్ష్మినారాయణ, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments