నరసన్నపేట:పట్టణంలోని శ్రీ జ్ఞాన జ్యోతి స్కూల్ నందు నిర్వహించినటువంటి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC) అను కార్యక్రమాన్ని శనివారం నిర్వహించామని స్కూల్ మేనేజ్మెంట్ వెలమల భాస్కరరావు ,బోర రామారావు,తర్ర సత్యనారాయణ,పాగోటి లక్ష్మి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారన్నారు.విద్యార్థుల్లో ఉన్న భయాందోళన బయటకు తీయడానికి SLC ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను తల్లిదండ్రుల ముందు ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసి మేనేజ్మెంట్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ,ఉపాధ్యాయయేతర సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments