ప్రజా పత్రిక - శ్రీకాకుళం: జిల్లాలో గురువారం 100 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. ఇప్పటివరకు 9,81,494 మంది నమూనాలు సేకరించి గా 47,762 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈరోజు 45 మంది డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 793 మంది చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ మళ్లీ పెరుగుతున్నందున ప్రజలు మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలన్నారు.
0 Comments