ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కరోనాతో నిత్యము పదుల సంఖ్యలో మృతులు ఉండగా.. ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో మాత్రమే 2,3 మరణాలే చూపడము దారుణం.మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కళ్యాణ్


శ్రీకాకుళం:జిల్లాలో కరోనా మహమ్మారి మరణ మృందంగం మోగిస్తోంది.నిత్యం పదుల సంఖ్యలో మృతులు ఉండగా ప్రభుత్వ హెల్త్‌ బులిటెన్‌లో మాత్రం రెండు, మూడు మరణాలనే చూపుతున్నారు.కరోనా వేళ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా మరింత వ్యాప్తికి అవకాశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే వార్తలు వస్తున్నాయి.జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి.నిత్యం 1,500 కేసులకు పైగా ఉంటున్నాయి.ఇదిలా ఉండగా డిగ్రీ కళాశాలల్లో తరగతులు, వసతిగృహాలు కొనసాగిస్తుండటం విశేషం.ఈ సందర్భంగా మానవ హక్కుల సెల్ జిల్లా అధ్యక్షులు పెదకోట కళ్యాణ్ మాట్లాడుతూ... కరోనా సెకండ్‌ వేవ్‌తో జిల్లాలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు.ఇటువంటి సమయంలో డిగ్రీ కళాశాలలో తరగతులు, వసతిగృహాలు కొనసాగించడం వల్ల అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ప్రమాదం పొంచి కాసి ఉందన్నారు. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు.. విద్యార్థులు, ఉపాధ్యాయుల గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నారు.కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.కళాశాలలకు ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు వస్తుంటారు.వారిలో ఎవరికైనా వైరస్‌ ఉన్నట్లయితే వ్వాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, మిగిలిన వారు కరోనా భారిన పడే అవకాశం ఉందని చెప్పారు.ఉపాద్యాయులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దన్నారు.దీనిపై అధికారులు, అధికార పార్టీ నాయకులు.. మరోమారు ఆలోచించి కళాశాలలకు సెలవులు ప్రకటించాలని విన్నవించారు.ఉపాద్యాయులు, విద్యార్థులకు కరోనా నుంచి విముక్తి కలిపించాలని కోరారు.

Post a Comment

0 Comments