నరసన్నపేట: మండలంలోని కరగాం పంచాయతీ నర్సింగపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద అనధికారిక వ్యక్తులు రుబాబు చేస్తున్నారనే.... విషయంపై నరసన్నపేట ఎ.పి.ఓ కొత్తకోట యుగంధర్ సీరియస్ అయ్యారు.ఉపాది పనుల వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ తప్ప ఇంకే ఇతర వ్యక్తులు ఉండకూడదన్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ లతో మాట్లాడి హెచ్చిరించినట్లు అయన పేర్కొన్నారు. ఇంకోసారి అనాధికార వ్యక్తులు ఉపాది పనుల వద్దకు వచ్చినా , కూలీలపై రుబాబు చేసినా సంబందిత ఫీల్డ అసిస్టెంట్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎపిఓ యుగంధర్ తెలిపారు.
0 Comments