ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కరోనా కేసులపై అప్రమత్తత అవసరం


శ్రీకాకుళం, ఏప్రిల్ 10 : జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  వైద్యులకు సూచనలు జారీ చేస్తూ జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని, వైద్యులు పూర్తి సమాయత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క వ్యక్తి కూడా మరణించకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆయన సూచించారు.  అన్ని మందులను సిద్ధంగా ఉంచాలని, పిపిఇ కిట్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా లోపం లేకుండా చూడాలని, అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. నర్సింగ్ సేవలు, ఎఫ్.ఎన్.ఓ, ఎం.ఎన్.ఓ సేవలు, పారిశుద్ధ్య పనులు సకాలంలో జరగాలని ఆయన పేర్కొన్నారు. వచ్చిన కేసులను పరిస్థితికి అనుగుణంగా చేర్చుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రేయింబవళ్ళు సేవలను అందించుటకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. 


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సర్వజన ఆస్పత్రి   వైద్యులు హేమంత్, ఆర్.అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments