
ప్రజా పత్రిక :శ్రీకాకుళం,ఏప్రిల్ ,9 : కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాధ రావు పరిశీలించారు. శుక్రవారం బర్మా కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం, ఇతర కేంద్రాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో వృధా కారాదని ఆయన స్పష్టం చేశారు. వాక్సిన్ వయల్ ను ప్రారంభిస్తే అదే క్రమంలో దాన్ని పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ సురక్షితమైనదని ఆయన పేర్కొంటూ కోట్లాది రూపాయలు ఖర్చుతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి వెంటనే వ్యాక్సినేషన్ పొందాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని జగన్నాధ రావు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,00,186 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారని ఇందులో కోవిషీల్డ్ ను మొదటి డోసుగా 1,32,061 మంది, రెండవ డోస్ గా 27,433 మంది., కోవ్యాక్సిన్ ను మొదటి డోసుగా 36,718 మంది, రెండవ డోస్ గా 3,974 మంది తీసుకున్నారని ఆయన తెలిపారు. హెల్త్ వర్కర్లు మొదటి డోసుగా 17,857 మంది, రెండవ డోస్ గా 14,083 మంది తీసుకున్నారని., ఫ్రంట్ లైన్ వర్కర్లు మొదటి డోస్ గా 21,540 మంది, రెండవ డోస్ గా 11,823 మంది., పోలీసు సిబ్బందిలో మొదటి రోజు 3,185 మంది, రెండవ డోస్ గా 363 మంది, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు మొదటి డోస్ గా 71,671 మంది, రెండవ డోస్ గా 3,268 మంది., దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 సంవత్సరాలు పైబడినవారు మొదటి డోస్ గా 46,048 మంది., రెండవ డోస్ గా 1,223 మంది తీసుకున్నారని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ త్వరగా తీసుకోవాలని తద్వారా సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దానిని సద్వినియోగం చేసుకుని మనము, మన కుటుంబం, స్నేహితులు సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలో సచివాలయాల పరిధిలో కూడా వాక్సినేషన్ ప్రారంభం అయిందని సంబంధిత వాలంటీర్లు సమాచారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. వాక్సినేషన్ చేయించుకోవాలని సురక్షితమైనది ఆయన చెప్పారు.
0 Comments