జలుమూరు మండలంలో గురువారం నిర్వహించిన పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎంపీడీవో దామోదర్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో 12,750 మంది పురుషులు 13,715 మంది మహిళలు మొత్తం 26,957 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో అత్యధికంగా అందవరం ఎంపీటీసీ పరిధిలో 66% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా వెంకటాపురం ఎంపీటీసీ పరిధిలో 33 శాతం నమోదు అయింది. మండలంలో అందవరం ఎంపీటీసీ పరిధిలో అధికార పార్టీ వైసిపి అభ్యర్థులతో పాటు టిడిపి, జనసేన అభ్యర్థులు తమ ఏజెంట్ లను పోలింగ్ కేంద్రాల వద్ద నియమించారు. శ్రీముఖలింగం లో వైసిపి రెబల్ అభ్యర్థి పోటీలో ఉండడంతో అక్కడ కూడా ఇరువురు ఏజెంట్లను నియమించారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో అందవరం తప్ప మిగిలిన అన్ని స్థానాల్లోనూ టిడిపి ఎన్నికలను బహిష్కరించింది. టిడిపి నాయకులు ఎవరు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అల్లాడ పేట లో జెడ్ పి టి సి అభ్యర్థి మెండ విజయశాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
0 Comments