ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మే 8కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా


ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ

ప్రజా పత్రిక - శ్రీకాకుళం, ఏప్రిల్ 8 : జాతీయ లోక్ అదాలత్ మే 8వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 10వ తేదీన నిర్వహించవలసిందిగా గతంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నుండి ఆదేశాలు అందాయని అయితే ప్రస్తుతం దీన్ని మే 8వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం అందిందనిఆయన తెలిపారు. ఈ విషయాన్ని కక్షిదారులు గమనించి తమ అర్జీలను మే 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ మార్పును కక్షిదారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు గమనించాలని ఆయన కోరారు.  వచ్చే నెల 8 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Post a Comment

0 Comments