తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి వేడుకలు బీచ్ రోడ్ విశాఖపట్నంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని ఆ పార్టీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని బి.వి.రామ్ అన్నారు .
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి 2010లో పార్టీని పెట్టి 2019లో అధికారంలోకి వచ్చారన్నారు. అంటే దాదాపు తొమ్మిదేళ్ల పాటు తర్వాత అధికారం వచ్చిందన్నారు. కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు ప్రేరణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూలస్థంభాలు గా నిలిచి 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వస్తారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఇదే క్రమంలో 2024 ఎన్నికల నాటికి జగన్ను సాగనంపి రాష్ట్ర పగ్గాలను చంద్రబాబు కు అప్పగిస్తారని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడును ఇబ్బందులు పెట్టేందుకు జగన్మోహన్రెడ్డి ప్రయత్నించినా సాధ్యం కాదని ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు అన్నారు. రాజశేఖర్ రెడ్డి కి సాధ్యం కాని పనులు జగన్ మోహన్ రెడ్డి వల్ల కూడా కావని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో వి.రమేష్ , కోడే బాబురావు ,బి.రవిశంకర్ వి.వంశీ, కే.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments