ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన సీఎం జగన్

అమరావతి:  అందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ,  86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు.

ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని’’ సీఎం జగన్ అన్నారు

Post a Comment

0 Comments