సెకండ్ వేవ్ కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
ఊపిరితత్తులు యొక్క సామర్ధ్యం పెంచడానికి, కరోనా ఎదురుకుంటున్న వ్యక్తుల్లో దైర్యం పెంచడానికి యోగా యొక్క అవసరం చాలా ఉంది, డాక్టర్స్ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరియు ప్రాణాయామం మరియు యోగా ఆసనాలు సాధన చెయ్యండి అని చెప్తున్నారు,
సమాజానికి నా వంతు సహాయంగా ఆన్లైన్ ద్వారా ఉచితంగా కరోనా కి సంబందించిన యోగా ఆసనాలు, ప్రాణాయామం తెలియచేస్తున్నాను అని యోగా గురువు సదాశివుని రవి తెలియచేశారు
ఈ యోగా ఆన్లైన్ క్లాస్ అభ్యసించడం ద్వారా శరీరంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకొని ఆయాసం దగ్గును తగ్గించుకుని ఆక్సిజన్ లెవెల్స్ తో బాటు ఇమ్యూనిటీ పవర్, ధైర్యాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఉపయోగ పడుతుంది,
ఈ అవకాశాన్ని హెూమ్ క్వారంటైన్ ఉన్నవాళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు
0 Comments