ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మీ సేవలు చిరస్మరణీయం..జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ .

శ్రీకాకుళం. మే 31. ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం అని ఉద్యోగ విరమణ పొందిన పోలీసు ఉద్యోగలు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ఎస్పీ అమిత్ బర్దార్  పేర్కొన్నారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేసి దుశ్శాలువతో సన్మానించిననారు .

సీ.సీ.యస్. పోలీసు స్టేషన్ నందు ఎస్.ఐ.లుగా పనిచేస్తున్న కృష్ణారావు వి. సింహాచలం, సారువకోట పోలీసు స్టేషన్ నందు ఏ.ఎస్.ఐ గా పనిచేస్తున్న బి.సూర్యనారాయణ మరియు ఆర్మ్డ్ రిజర్వ్ నందు పనిచేస్తున్న కానిస్టేబుల్ ఏం.వి. రమణమూర్తి  గారులు పదవీ విరమణ చెయనున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సుమారు 35 సంవత్సరాల పాటు అంకితభావంతో పోలీసు శాఖకు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పిల్లలు చదువులు,వారి ఉద్యోగ వివరాలు అడిగి మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.రిటైర్ అయ్యాక తల్లిదండ్రులును బాగా చసుకోవలని కోరిరు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు పోలీసుశాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.శేష జీవితం కుటుంబ సభ్యులతో గడుపుతూ,కోవిడ్ సమయంలో ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పదవి విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేననిన్నారు. సమాజ సేవలో పాల్గొని పూర్వ శాఖకు మంచి పేరు ప్రతష్ఠలు తీసుకురావాలనిన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా నన్ను నేరుగా సంప్రదించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) పి. సోమశేఖర్ గారు, అదనపు ఎస్పీ(క్రైమ్) టి.పి.విఠలేశ్వరరావు గారు,పోలీసు కార్యాలయ ఏ.ఓ.,శివ రామ రాజు గారు, పోలీసు అసోషియేషన్ సభ్యులు జగన్మోహన్ రావు, జగదాంబ మరియు ఉద్యోగులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments