ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చిరువ్యాపారుల ఉపాధికి ఊతం “జగనన్నతోడు”రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి• జిల్లాలో 16 వేల 690 మంది లబ్దిదారులు• 16 కోట్ల 69 లక్షల రూపాయలు

శ్రీకాకుళం, జూన్ 8 : నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10వేలు చొప్పున వడ్డీలేని రుణాలను అందించే కార్యక్రమమే “జగనన్న తోడు ” అని  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రెండవ విడత “జగనన్న తోడు ” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. చిరువ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకూడదని, వారి ఆగడాలకు గురికాకూడదన్న సమున్నత లక్ష్యంతో కరోనా కష్టకాలంలో సైతం “జగనన్న తోడు ” కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలు చూసానని, చిరువ్యాపారులకు మేలుచేసేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. చిరువ్యాపారులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశ్యంతో చిరువ్యాపారులకు చేదోడుగా ఉండాలని వారి పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, ఒక్కొక్కరికీ ఏటా రూ.10 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందని తెలిపారు.   జిల్లాలో శాసన సభ నియోజక వర్గాల వారీగ ఆమదాలవలస నియోజక వర్గంలోని ఆమదావలస మండలంలో 356, బూర్జ మండలంలో 381, పొందూరు మండలంలో 410, సరుబుజ్జిలి మండలంలో 264 మంది లబ్దిదారులు, ఎచ్చెర్ల నియోజక వర్గంలో ఎచ్చెర్ల మండలంలో 558, జి. సిగడాం మండలంలో  425, లావేరు మండలంలో 484, రణస్థలం మండలంలో 657 మంది, ఇచ్చాపురం నియోజక వర్గంలో ఇచ్చాపురం మండలంలో 317, కంచిలి మండలంలో 477, కవిటి మండలంలో 610, సోంపేట మండలంలో 621 మంది, నరసన్నపేట నియోజక వర్గంలో జలుమూరు మండలంలో 504, నరసన్నపేట మండలంలో 506, పోలాకి మండలంలో 527, సారవకోట మండలంలో 413 మంది, పాలకొండ నియోజక వర్గంలో భామిని మండలంలో 276 మంది, పాలకొండ మండలంలో 370 మంది, సీతంపేట మండలంలో 225 మంది, వీరఘట్టం మండలంలో 463 మంది, పలాస నియెజక వర్గంలో మందస మండలంలో 408 మంది, పలాస మండలంలో 291 మంది, వజ్రపుకొత్తూరు మండలంలో 760 మంది, పాతపట్నం నియోజక వర్గంలో హిరమండలం మండలంలో 333, కొత్తూరు మండలంలో 256 మంది, లక్ష్మినర్సుపేట మండలంలో 341 మంది, మెళియాపుట్టి మండలంలో 243 మంది, పాతపట్నం మండలంలో 399 మంది, రాజాం  నియోజక వర్గంలో రాజాం మండలంలో 448 మంది, రేగిడిఆముదాలవలస మండలంలో 516 మంది, సంతకవిటి మండలంలో 468 మంది, వంగర మండలంలో 315 మంది, శ్రీకాకుళం నియోజక వర్గంలో గార మండలంలో 483 మంది, శ్రీకాకుళం లో 643 మంది, టెక్కలి నియోజక వర్గంలో కోటబొమ్మాళి మండలంలో 480 మంది, నందిగాం మండలంలో 485 మంది, సంతబొమ్మాళి మండలంలో 609 మంది, టెక్కలి మండలంలో 368 మందికి జగనన్న తోడు పథకం  బ్యాంకు ఖాతాలలో జమఅవుతుంది. అనంతరం    16 కోట్ల 69 లక్షల రూపాయల చెక్కున లబ్దిదారులకు అందజేశారు. చెక్కు అందజేసిన వారిలో  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్, సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments