నరసన్నపేట మండలం కొత్తపోలవలస గ్రామంలో కొత్తపోలవలస - లుకలాం - ముసిడిగట్టు క్లస్టర్ పరిధి లో కార్యకర్తలతో కృష్ణచైతన్య రచ్చబండ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపీ నాయకులు , ప్రజలు , విద్యార్థులు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి నాయకులు , ప్రజలు , విద్యార్థులు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టాలని అన్నారు . పార్టీలో కార్యకర్తలకు పెద్ద పేట వేసి రాబోయే మన ప్రభుత్వం లో కార్యకర్తల ద్వారా పాలన చేస్తామని హామీ ఇచ్చారు . గ్రామ కమిటీలు త్వరగతిన పూర్తిచేసి కేంద్ర కార్యాలయం కి పంపించాలని కోరారు . కార్యకర్తలకు కూటమి నాయకుల ద్వారా గాని అధికారులు ద్వారా గాని ఎలాంటి అన్యాయం జరిగిన , ఆక్రమణ జరిగిన డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని సూచించారు .ఈ కార్యక్రమం లో ఎంపీపీ ఆరంగి మురళిధర్ జెడ్పీటీసీ చింతు రామారావు రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, మండల అధ్యక్షులు లుకలాపు రవి, రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు సురంగి నర్సింగరావు, నియోజకవర్గ పంచాయతీ రాజ్ అధ్యక్షులు బగ్గు రమణయ్య,వైస్ ఎంపీపీ చింతల వెంకటరమణ , జిల్లా SC సెల్ ఉప అధ్యక్షులు సతివాడ రామినాయుడు,మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్,మండల రైతు విభాగ అధ్యక్షులు వాకముల్ల చక్రధర్, మండల పంచాయతీ రాజ్ అధ్యక్షులు యాబాజీ రమేష్, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు,మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు దుల్ల రమణ, మండల వాలంటీర్ సెల్ అధ్యక్షులు బడ్డ శ్రీను,రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ , మండల ఉప అధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు, మండల కార్యదర్శి చింతల సత్యం ,సర్పంచ్లు సేనాపతి శ్రీనివాస్ , ఎంపిటిసి కోట జోగినాయుడు ,బార్ల వేణు,మండల యూత్ ఉప అధ్యక్షులు తోట భార్గవ్, బగ్గు సతీష్ , గొల్లంగి మహేష్ , సబ్బ పోలినాయుడు, బగ్గు సింహాచలం ,గొల్లంగి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments