శ్రీకాకుళం టౌన్ - రాష్ట్ర పౌరసరఫరాల ఎండి ఢిల్లీరావుని, అమరావతి కమీషనర్ కార్యాలయంలో, అన్ని జిల్లాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు గౌరవంగా కలసి సమస్యలను విన్నవించారు. కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లు షాపు నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక భారాలను మాకు వచ్చే కమిషన్ నుండే భరించడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రేషన్ డోర్ డెలివరీ సమయంలో మాకు ఉన్న కార్డుల సంఖ్యను బట్టి నెలకు 15 వందల నుండి 3 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. వృద్ధులు దివ్యాంగులు మహిళలు ఉండటం వలన, ఒక సహాయకుడుని నియమించుకొని వారికి మాకు ఉన్న ఎలాట్మెంట్ను బట్టి మూడు వేల నుండి 6 వేల రూపాయల వరకు వేతనంగా ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం వస్తున్న కమిషన్ నుండి షాపు అద్దె, డోరి డెలివరీ ఖర్చులు, సహాయకుడి వేతనం కూడా భరిస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురౌతున్నామన్నారు. రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఇస్తున్న రూపాయి కమిషన్ 2 రూపాయలకు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లకు ఆర్థిక భద్రతను కుటుంబ భద్రతను కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న 29వేల 736 కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా విన్నపాన్ని మన్నించి కమిషన్ పెంపుదల చేయవలసిందిగా కోరుతున్నామని, ఐసిడిఎస్ ఎండిఎం కమీషన్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఎమ్ యల్ యస్ పాయింట్ల వద్దనుండి నికర తూకంతో సరుకులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఆరోగ్య భద్రత కుటుంబ భద్రత కల్పించాలని విన్నపించామన్నారు.
ఎండీని కలిసినవారిలో రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకటరావు, శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు వడగ. భాస్కర్ రావు, బుగత వెంకటేశ్వర్లు, కాట ఆంజినేయులు, ఏలూరు ప్రసాద్ రాజు, అనంతపురం బాల నాగిరెడ్డి, వైజాగ్ చిట్టి రాజ్ 26జిల్లాల అధ్యక్షులు ఉన్నారు.
0 Comments