ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రిమ్స్ పారిశుధ్య కార్మికుల పోరాట ఫలితంగా 549 జీవో ప్రకారం 16,000 రూపాయలు అమలు.కార్మికుల విజయోత్సవ సభ

శ్రీకాకుళం నగరంలో శుక్రవారము రిమ్స్ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికుల తో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా AICCTU జిల్లా కన్వీనర్ డి గణేష్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు ఆకుల శ్యామల, దమ్ము సింహాచలం మాట్లాడుతూ  కృష్ణ కన్స్ట్రాక్షన్స్ యాజమాన్యం తో మూడు సంవత్సరాలు కు గాను 245 మంది కార్మికుల సమక్షంలో వేతన ఒప్పందం జరిగిందని,549 జీవో ప్రకారం కార్మికుడికి 16 వేళారూపాయలు వేతనం చెల్లిస్తామని కృష్ణ కన్స్ట్రాక్షన్స్ యండి శ్రీ కోట అవినాష్ రెడ్డి అంగీకరించారని,ప్రతినెల 5 వతేదీనాటికి వేతనాలు వారి కార్మిలకు అకౌంట్లకు జమచేస్తామని, పీఎఫ్, ఈ ఎస్ ఐ లు పద్దతిప్రకారం కడతామని చెప్పారని అన్నారు,బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలు చెల్లిస్తామని వారు అన్నారు అని చెప్పారు. షణ్ముఖరావు, కృష్ణ, లుట్ట పెంటయ్య, నారు దమయంతి, అంబటి అరుణ,జరుగుళ్లు వసంతారావు, మెండ అశ్విని, చింతల పొలమ్మ, ముకళ్ల రమణ,గొంటి కృష్ణవేణి, గురు ఉషారాణి, అప్పన్న,రవి,ధనలక్ష్మి, ఈశ్వరరావు,అన్నపూర్ణ సుధారాణి, నీలవేణి, కొల రోజా, సాంబమూర్తి, తవితమ్మ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments