ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ నరసన్నపేట మండల నూతన కార్యవర్గం ఎన్నిక

నరసన్నపేట మండల కేంద్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవ కల్యాణ మండపంలో ప్రైవేట్ టీచర్స్ అండ్  లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు గంగు మన్మధరావు సూచనల మేరకు మండల కమిటీ ఎన్నికల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో యూనియన్ సభ్యులు అందరూ కలిసి అధ్యక్షులు గా జి. మల్లేశ్వరరావును ఉపాధ్యక్షులుగా డాక్టర్ డి.కోటేశ్వరరావు మరియు .ఎస్ శంకర్రావు మరియు చింతు శ్రీనివాసరావు. ప్రధాన కార్యదర్శిగా బాడన రవీంద్ర ఉప ప్రధాన కార్యదర్శులుగా పోగొట్టి మోహన్రావు కుంచాల వేణు మొగిలి రామకృష్ణ ప్రధాన సలహాదారుగా వంజరాపు కసవయ్య, కోశాధికారిగా పొన్నాడ రామ్ మోహన్ కన్వీనర్లుగా  రత్నకుమారి , తేజోవతి . యూనియన్ సభ్యులు గా డి నగేష్ ఆర్ గోవిందరావు శ్రీకాంత్ షణ్ముఖ రావులను ఎన్నుకోవడం జరిగిందని ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మల్లేశ్వరరావు తెలిపారు. వీరికి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments