ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కొరసవాడ నూతన గ్రామ సచివాలయం మరియు రైతుభరోసా భవనాల్ని పరిశీలించిన : ఎమ్మెల్యే రెడ్డి శాంతి

గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా పాతపట్నం మండలంలోని   కొరసవాడ గ్రామంలో నూతనంగా నిర్మితమవుతున్న కొరసవాడ గ్రామ సచివాలయం మరియు రైతు భరోసాకేంద్రం భవనాలను పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి పరిశీలించారు.
ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో భవనముల  నిర్మాణ పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. అనంతరము గ్రామ సచివాలయ కార్యాలయమును  సందర్శించి సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లుతో మాట్లాడుతూ  అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేవిధంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల తహశీల్దార్ యం.కాలీప్రసాద్, ఎంపిడివో జయంత్ ప్రసాద్, ఈఓపీఆర్డీ నరసింహ ప్రసాద్ పండ, కొరసవాడ సర్పంచ్ జక్కర ఉమ   మరియు గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కాగువాడ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments