శ్రీకాకుళం, జూన్ 17. వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం ఎచ్చెర్ల నందు గల జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు కార్యాలయం పరిధిలోని ఉన్న చిన్న రావు పల్లి ఫైరింగ్ రేంజ్ నందు జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు,సిబ్బందికి ఫైరింగ్ సాధన ప్రక్రియ ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నిలిపారు.ఈ క్రమంలో ముందుగా ఫైరింగ్ సాధన కోసం ఉయోగించే అయధాలను క్షుణ్ణంగా పరిశీలించారు.వార్షిక ఫైరింగ్ జరగుతున్న నేపథ్యంలో ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెళకువలు నేర్చుకొని ఫైరింగ్ నందు అనుమానాలు వుంటే వాటిని నివృత్తి చేసుకోవాలనిన్నారు.ప్రతి ఒక్క బుల్లెట్టు టార్గెట్ (లక్ష్యం) వైపే బుల్ పడే విధంగా తర్పీదు పొందాలని సూచించారు.అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీసు శాఖ యొక్క ఉన్నతి కోసం ముందడుగు వేయాలని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు అధికారులు, సిబ్బందికి ఉద్దేశించి సూచనల చేశారు. జిల్లా ఎస్పీ తో పాటుగా అదనపు ఎస్పీ
టి. పి. విఠలేశ్వరరావు, ఇతర డీఎస్పీలు ఫైరింగ్ సాధన చేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి. పి. విఠలేశ్వరరావు(క్రైమ్),డీఎస్పీలు ఎం.మహేంద్ర,ఎం.శ్రావణి,ఎం. శివారామిరెడ్డి, సి.హెచ్. శ్రీనివాసరావు,సి.హెచ్. ప్రసాదరావు,ఎస్.వాసుదేవ్,జి.వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు,ఎన్. ఎస్.ఎస్.శేఖర్,కె.బాలరాజు, బి. నాగేశ్వరరావు, అర్.ఐ ప్రెదిపు పాల్గొన్నారు.
0 Comments