ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయండి.జిల్లా ఎస్పీ సెంథిల్ ‌కుమార్‌

మదనపల్లె:కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయాలని జిల్లా ఎస్పీ సెంథిల్ ‌కుమార్‌ అన్నారు.

మదనపల్లె ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను అకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం స్టేషన్‌ నుంచి టౌన్‌బ్యాంకు కూడలి వరకు నడుచుకుంటూ వచ్చి పట్టణంలో కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ ఒక్కరు రోడ్లపైకి రాకుండా చేయాలని డీఎస్పీ రవిమనోహరాచారికి సూచించారు.

అలాగే నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

పట్టణంలో రహదారులన్నీ రంపపు తీగలతో బాక్ల్‌ చేసి ఉండటాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా ఎస్పీతో వెంట ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ కేశప్ప, ఒకటో పట్టణ సీఐ ఈదురుబాషా, రూరల్‌ సర్కిల్‌ సీఐ ఆశోక్‌కుమార్‌, రెండో పట్టణ సీఐ నరసింహులు ఉన్నారు.

Post a Comment

0 Comments